calender_icon.png 4 March, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్కా కొమురయ్య గెలుపు..

04-03-2025 12:43:52 AM

ఇందూరులో సంబరాలు గురువులకు పాదాభివందనం బీజేపీ అధ్యక్షుడు దినేష్

నిజామాబాద్, మార్చి 3: (విజయ క్రాంతి) ః కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బిజెపి అభ్యర్థి మల్కా కొమురయ్య ఎన్నికయ్యారు. బిజెపి అభ్యర్థి కొమురయ్య టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికవ్వడంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బిజెపి శ్రేణులు అధ్యక్షుడు దినేష్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ లోని ప్రధాన కూడలి అయిన నిఖిల్ సాయి చౌరస్తాలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి మాట్లాడుతూ ఉపాధ్యాయులందరికీ పేరుపేరునా పాదాభివందనం తెలిపారు. నరేంద్ర మోడీపై ఉన్న నమ్మకంతో భారతీయ జనతా పార్టీకి నిజాన్ని కట్టబెట్టిన ఉపాధ్యాయులందరికీ రుణపడి ఉంటావని ఆయన అన్నారు. కొండ ఆశన్న బిజెపి యువ నాయకుడు దొంతుల రవి అంబదాసరావు మల్లేష్ గంగోలి గంగాధర్ తో పాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాల లో పాల్గొన్నారు.

సోమవారం జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో  వదులుకొని కొమురయ్య తన ఆధిపత్యం కొనసాగించారు. ఇదిలా ఉండగా ప్రధాన్యత క్రమంలో మొదటి రెండవ విడత ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికి ప్రాధాన్యత రాలేదు.

ప్రాధాన్యత క్రమంలో 12 వేలకు మించి ఓటు సాధించిన వారిని విజేతలుగా ప్రకటించారు బిజెపి అభ్యర్థి కొమురయ్యకు 12,959 పిఆర్టియు అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి కి 7 182. టి పి టి ఎఫ్ అభ్యర్థి అశోక్ కుమార్కు 2621. ఎస్ టి యు అభ్యర్థి కూర రగోతం రెడ్డికి 428 ఓట్లు వచ్చాయి.

మొత్తం పోలైన ఓట్లు 25.041 కాగా 897 ఓట్లు తిరస్కరణలో చల్లకుండా పోయాయి  24.144 ఓట్ల లెక్కించగా గెలుపుకోవడానికి చేరిన బిజెపి అభ్యర్థి మలక కొమరయ్యను విజేతగా ప్రకటించారు ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలాసపతి బిజెపి అభ్యర్థి కొమురయ్య గెలిచినట్టు ప్రకటించారు