calender_icon.png 4 March, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీచర్స్ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య ఘనవిజయం

03-03-2025 10:24:57 PM

మందమర్రి (విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బిజెపి నుండి బరిలో దిగిన మల్క కొమురయ్య, 5777 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో బిజెపి బలపరిచిన అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959 ఓట్లు రాగా తన సమీప ప్రత్యర్థి వంగ మహేందర్ రెడ్డికి 7182 ఓట్లు వచ్చాయి. అశోక్ కుమార్ కు 2621, కూర రఘోత్తం రెడ్డికి 428 ఓట్లు పోలయ్యాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్కా కొమురయ్య 5777 ఓట్లతో ఘనవిజయం సాధించడంతో బిజెపి శ్రేణులు ఉపాద్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.