మాడవేడి వినోద్ కుమార్, జిల్లా అధ్యక్షులు, బిసి ఉపాధ్యాయ సంఘం..
నిజామాబాద్ (విజయక్రాంతి): ఈ రోజు జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హోటల్ లో బిసి ఉపాధ్యాయ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ... బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లకై, బిసిలకు క్రమిలేయర్ విదానం రద్దు కొరకై, బిసిలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల కై, కరీంనగర్ ఉపాధ్యాయ ఎంఎల్సి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విద్యావేత్త మల్క కొమరయ్యకు బిసిటియు మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్సి అభ్యర్థి మల్క కొమరయ్య, రెంజర్ల నరేష్, బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్షి రాఘవాపురం గోపాలకృష్ణ, గౌరవ అధ్యక్షులు కైరంకొండ బాబు, బిసిటియు నాయకులు కొట్టాల రామకృష్ణ, కొట్టూరు రమేష్, శంకర్ రమణ స్వామి తదితరులు పాల్గొన్నారు.