మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): గత 24 సంవత్సరాలుగా ఆంధ్రాలో ఎస్టీలుగా, తెలంగాణలో బీసీలుగా ఉన్న మాలి కులస్తులకు సామాజిక న్యాయం, ఎస్టీ హోదా వరకు మాలి కులస్తులు విశ్రమించారని మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే అన్నారు. ఆదిలాబాద్ లో శుక్రవారం నిర్వహించిన సంఘం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనేక పోరాటాలు చేసిన ఫలితంగా గత ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. అలాగే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మాలిలకు ఎస్టీ హోదా కల్పన విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే వారసులకు సామాజిక న్యాయం అందించాలని కోరుతూ ఫిబ్రవరి 10న హైదరాబాద్ కు వెళ్లి వారిని కలిసి విన్నవించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 9న అదిలాబాద్ లోమాలి సంఘ రాష్ట్ర, జిల్లా, యువజన, మహిళ కమిటీల ఎన్నికలు జరగనున్నాయని ఇందులో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సంఘం సభ్యులు హాజరుకావలన్నారు.