calender_icon.png 4 January, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక న్యాయం కోసం మాలీలు ఏకం కావాలి

01-01-2025 04:35:56 PM

మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): గత 24 సంవత్సరాలుగా మాలి కులస్తులు సామాజిక న్యాయం కోసం అనేక పోరాటాలు చేశారని అయిన పూర్తి స్థాయిలో మాలీలకు న్యాయం జరగలేదని మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే అన్నారు. అందుచేతనే సామాజిక న్యాయం కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 3 లక్షల మంది మాలీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనవరి 12న కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరగనున్నాయని, ఇందులో ప్రతి గ్రామానికి ఇద్దరు ఓటర్లు ఓటు వేసి రాష్ట్ర కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఎన్నుకుంటారని తెలిపారు. అలాగే జనవరి 3న దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన జరుపుకునీ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న షిండే, పటేల సంఘం జిల్లా అధ్యక్షులు షిండే గంగారం, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ ఉమేష్ రావు డోలే, సభ్యులు పాల్గొన్నారు.