17-04-2025 12:18:48 AM
పూనెం ప్రదీప్ కుమార్ డిమాండ్
భద్రాచలం, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల ఇతర వసతి గృహాలలో పనిచేస్తున్న మగ ఉద్యోగులను, సిబ్బందిని తక్షణమే తీసివేయాలని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పూనెం ప్రదీప్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో దుమ్ముగూడెం మండలం రామచంద్రుని పేట ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసింది.
ఆ వీడి యోలో హై స్కూల్ హెడ్మాస్టర్ గా పనిచేసే వ్యక్తి కోయ సామాజికవర్గానికి చెందిన ఆడ పిల్లల ను అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇక్కడ పనిచేసే కోయవారిని పనిలో నుంచి తీసివేసేందుకు కూడా కుట్రలు పన్నుతున్నాడని ఆ విద్యార్థిని సెల్ఫీ వీడియోలో చెప్పడం జరిగింది. హాస్టల్లో జరుగుతున్న వివక్షకు లంబాడి సామాజిక వర్గ వ్యక్తులు చేసే దాడులకు నిద ర్శనమని ఆయన అన్నారు.
హాస్టల్లో అందరూ కలిసిమెలిసి చదువుకొని ఎటువంటి భేదాలు లే కుండా ఉండేందుకు తగు చొరవ తీసుకోని విద్యాభివృద్ధిలో నేర్పాల్సిన గురువు, మనుషుల మ ధ్య వైశ్యమ్యాలు రెచ్చగొట్టి తమ సామాజిక వర్గ విద్యార్థినీలతో ఇబ్బంది పెట్టించడం దుర్మార్గమైన చర్యని అటువంటి వ్యక్తిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జి ఓ ఎం ఎస్ 1274 ప్రకారం గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల ఇతర బాలికల వసతి గృహాలలో మగ ఉద్యోగస్తులు, సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో పనిచేయడానికి వీలు లేదని, అలా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభు త్వం జీవో విడుదల చేసినా కొంతమంది అధికారుల నిర్లక్ష్య పూరిత వైఖరికి కారణంగా ఇటువం టి సంఘటనలు జరుగుతున్నాయని, తక్షణమే ఆడపిల్లల వసతి గృహాల్లో పనిచేసే మగ ఉద్యోగస్తులను, సిబ్బందిని తక్షణమే తొలగించాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోను ఆయన కోరారు.