12-03-2025 12:00:00 AM
1 నుంచి టాప్ 31 వరకు ర్యాంకులు వారివే..
ఫస్ట్ ర్యాంకర్ వెంకట హరవర్ధన్ సాధించిన మార్కులు 447.088
టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో జనరల్ ర్యాంకింగ్ జాబితా
హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): తెలంగాణ గ్రూప్ ఫలితాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి టీజీపీఎస్సీ కార్యాలయంలో మంగళవారం చైర్మన్ బుర్రా వెంకటేశం, సభ్యులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. 783 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్‌లో అభ్యర్థులు పరీక్ష రాయగా జనరల్ ర్యాంకుల జాబితా విడుదలైంది. ఫలితాల్లో పురుష అభ్యర్థులు టాప్ 10 ర్యాంకులు సాధించారు.
మిగ తా టాప్ ర్యాంకుల్లోనూ దాదాపుగా పురుష అభ్యర్థులదే పైచేయి. మొత్తం 600 మార్కులకు గాను నారు వెంకట హరవర్ధన్ అనే అభ్యర్థి 447.088 మార్కులతో ప్రథమ ర్యాంకు సాధించాడు. వడ్లకొండ సచిన్ రెండో ర్యాంకు, బి.మనోహర్‌రావు మూడో ర్యాంకులు సాధించి సత్తా చాటారు. టాప్- 31 ర్యాంకుల వరకు సాధించిన అభ్యర్థులందరూ అబ్బాయిలే కావడం గమనార్హం.
టాప్ 10 ర్యాంకుల్లో ఓసీ కేటగిరీకి చెందిన వారు ఐదుగురు, బీసీ (డీ) బీసీ (బీ) అభ్యర్థులు ఉన్నారు. 32వ ర్యాంకు నుంచి మహిళా అభ్యర్థుల ర్యాంకులు మొదలయ్యాయి. టాప్ మార్కులు సాధించిన 10 మంది మహిళా అభ్యర్థుల్లో నలుగురు ఓసీ కేటగిరీ, ముగ్గురు బీసీ (బీ), ఇద్దరు బీసీ (డీ), ఒకరు ఎస్టీ కేటగిరీకి చెందిన వారు. ర్యాంకుల సాధించిన వారిలో ఎక్కువ మంది అభ్యర్థులు ఇప్పటికే గ్రూప్ 4, టీచర్, పోలీస్, సింగరేణితో పాటు ఇతరత్రా ఉద్యోగాలు చేస్తున్నవారే కావడం గమనార్హం.
అలాగే ఏప్రిల్ 9వ తేదీ వరకు తుది కీ, మాస్టర్ క్వశ్చన్ పేపర్లతో పాటు ఓఎంఆర్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించి ఇతర వివరాలు తెలుసుకోవచ్చు.
జనరల్ ర్యాంకింగ్స్ ఆధారంగా అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇతర ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి టీజీపీఎస్సీ నుంచి వ్యక్తిగతంగా సమాచారం వస్తుంది. అలాగే టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లోనూ వివరాలు అందుబాటులో ఉంటాయి.
14న గ్రూప్ ఫలితాలు
టీజీపీఎస్సీ ముందుగా ప్రకటించిన షెడ్యూలుకు అనుగుణంగానే పోటీ పరీక్షల ఫలితాలను విడుదల చేస్తున్నది. ఈనెల 10న గ్రూప్ ఫలితాలను విడుదల చేసిన టీజీ పీఎస్సీ తాజాగా గ్రూప్ ఫలితాలనూ విడుదల చేసింది. అలాగే ఈనెల 14న గ్రూప్ ఫలితాలు, 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కొలువులు ఫలితాలు, 19న ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ కొలువుల ఫలితాలను విడుదల చేయనున్నది.