- గుండెపోటులో ఆస్పత్రిలో కనుమూత
- నాలుకెట్టు నవలతో పాపులర్
- స్క్రీన్ రైటర్, దర్శకుడిగా సేవలు
- కోలీవుడ్ సినిమాపై తనదైన ముద్ర
- సాహిత్యంలో ఎన్నో అవార్డులు
- ఎమ్‌టీ అట్టడుగు వర్గాల వాయిస్: మోదీ
కోజికోడ్, డిసెంబర్ 26:భారతదేశ గొప్ప రచయితలలో ఒకరైన ప్రముఖ మళయాల రచయిత ఎమ్‌టీ వాసుదేవన్ నాయర్(91) మృతి చెందాడు. కేరళలోని కోజికోడ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు. అనారోగ్య సమస్యలతో బాధపడు తూ గత వారం ఆస్పత్రిలో చేరారు.అయితే పరిస్థితి విషమించి గుండెపోటుతో బుధవా రం ఎమ్‌టీ మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో మళయాళ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.
సాహత్యం, సినిమాలు, జర్నలిజంలో తనదైన ముద్రను ఎమ్‌టీ వేశారు. వాసుదేవన్ నాయర్ తన రచనలతో ఎంతోమందిలో స్ఫూర్తినింపారు. ఆయన సాహిత్యానికి ఎన్నో అవార్డులు వరించాయి. ఎమ్‌టీకి గౌరవ సూచకంగా 26, 27 తేదీల్లో సంతాప దినాలుగా ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయన మరణం సాహిత్య ప్రపంచానికి తీరని లోటని పలువురు అన్నారు.
చిన్న వయసులోనే రచయితగా..
కేరళ రాష్ట్రంలోని ప్రస్తుతం పాలక్కాడ్ జిల్లా పొన్నాని సమీపంలోని కూడళ్లూరు అనే గ్రామంలో టి.నారాయణన్, అమ్మలు అమ్మ అనే దంపతులకు 1933, జూలై 15న ఎమ్‌టీ జన్మించారు. చిన్నతనం నుంచే అద్భుతమైన నైపుణ్యాలు కలిగిన రచయితగా ముద్ర వేశారు.
29 సంవత్సరాల వయ సులో ‘అసురవితుని’ నవల రాశారు. ఇది మలయాళంలోనే అత్యుత్తమ నవల అని ప్రముఖ విమర్శకులు ఎం లీలావతి, మరికొందరు ప్రశంసించారు. ఎమ్‌టీ రాసిన అనేక రచనలు ఇంగ్లీషులోకి అనువదించబడ్డాయి. దేశంలోనే అత్యధిక అనువదించబ డిన ప్రాంతీయభాషా రచయితలలో ఎమ్‌టీ ఒకరు. ఆయనకు 1995లో జ్ఞానపీఠ అవా ర్డు లభించింది.
ఎమ్‌టీగా ప్రసిద్ధి..
ఎమ్‌టీగా ప్రసిద్ధి చెందిన ఎమ్. వాసుదేవన్ నాయర్ తొమ్మది నవలలు19 చిన్న కథలు సంకలనాలు రాశారు. ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించారు. దాదాపు 54 స్క్రీన్‌ప్లేలు అందించారు. ఏడు దశాబ్దాల కెరీర్‌లో అనేక వ్యాసాలు, జ్ఞాపకాల సంకలనా లను ప్రచురించారు. ఆయన రాసిన ‘నాలుకెట్టు( పూర్వీకుల ఇల్లు)నవలతో సాహిత్యాని కి ఐకాన్‌గా మారారు. ఈ నవలను మలయాళ సాహత్యంలో క్లాసిక్‌గా పరగిణిస్తారు.
ఇంకా అతను రండమూజం, అసురవిత్తు, మంజు, కాలం, నాలుకెట్టుతో సహా పలు ప్రశంసలు పొందిన రచనలు రాశారు. వీటిలోని పాత్రలన్నీ మలయాళీ సాంస్కృతిక జీవితంలో భాగం అయ్యాయి. మలయాళ సినిమాలో స్క్రీన్ ప్లే రైటింగ్ కళను విప్లవాత్మకంగా మార్చిన అసాధారణమైన స్క్రిప్ట్ రైటర్‌గా ఎమ్‌టీ పేరు తెచ్చుకున్నారు. అంతేకాక వాటిలో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. పలు చిత్రాలకు పాటలు రాశారు. ఓ పత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు.
మురప్పెన్నుతో సినిమాల్లోకి..
ఎమ్‌టీ బహుముఖ ప్రజ్ఞాశాలి. అంతేకాక నిష్ణాతుడైన స్క్రీన్ రైటర్. 1965లో విన్సెంట్ దర్శకత్వం వహించిన ‘మురప్పెన్ను’ సినిమా స్క్రిప్ట్‌తో సినిమాల్లో తన కెరీర్‌ను ఎమ్‌టీ ప్రారంభించారు. ఈ సినిమా విజయం సాధిం చడంతో ఆయన వెనుదిరిగి చూడలేదు. దీంతో ఆయనకు స్క్రిప్ట్ రైటర్‌గా డిమాం డ్ పెరిగింది.
ఆ తరువాత ఒరు వడక్కన్ వీరగాథ, అమృతం గమ్య, పంచాగ్ని, పరిణయం, అక్షరంగల్, ఆల్యూట్టతిల్ తని యే, తాజ్వారం తదిరత క్లాసిక్ చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్‌గా సేవలు అందించారు. 2013లో వచ్చిన పజాస్సి రాజా సినిమా ఎమ్‌టీకి చివరి చిత్రం. కొన్ని నెలల క్రితం ఎమ్‌టీ రాసిన చిన్న కథలతో ‘మనోరథంగల్’ అనే వెబ్ సిరీస్‌ను తీసి ఓటీటీలో ప్రసారం చేశారు. ఎమ్‌టీ స్క్రీన్ కోసం ఈ సిరీస్ కోసమే చివరగా పనిచేవారు.
జ్ఞానపీఠ్ అవార్డు..
సాహిత్యంలో చేసిన సేవలకుగాను 1995లో జ్ఞానపీఠ్ అవార్డు ఎమ్‌టీకి లభించింది. అలాగే కేంద్ర సాహిత్య అకడమీ అవార్డు, కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, వాయలార్ రవి అవార్డు, వల్లథోల్ అవార్డు, ఎజుతాచ్చాన్ అవార్డు, మాతృభూమి ఓఎన్‌వీ సాహిత్య పురస్కా రం, అనేక ఇతర పురస్కారాలు వాసుదేవన్‌ను వరించాయి. 2005లో పద్మభూ షణ్ పురస్కారాన్ని వాసుదేవన్ నాయర్ అందుకున్నారు. 2013లో మలయాళ సినిమాకు చేసిన సేవలకుగాను జేసీ డేనియల్ జీవితకాల లైఫ్‌టైం అఛీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు.