05-04-2025 12:00:00 AM
ప్రముఖ మలయాళ నటుడు రవికుమార్ (71) కన్నుమూశా రు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1968లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవికుమార్ 150కిపైగా మలయాళ, తమిళ చిత్రాల్లో నటించారు. అనేక సీరియళ్లలోనూ వివిధ పాత్రలు పోషించారు. ‘అనుబంధం’ సీరియల్‌తోపాటు రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘శివాజీ’ సినిమాలో మంత్రి పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. రవికుమార్ మృతిపట్ల రాధికా శరత్‌కుమార్‌తోపాటు పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.