20-04-2025 12:33:52 AM
తిరువనంతపురం ఏప్రిల్ 19: డ్రగ్స్ తీసుకుంటాడనే ఆరోపణలతో మలయాళ నటు డు షైన్ టామ్ చాకోను కేరళ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శనివారం చాకోను విచారణకు పిలిచిన ఎర్నాకుళం నార్త్ పోలీసులు ఏడున్నర గంటల సుదీర్ఘ విచారణ అనంతరం అరెస్టు చేశారు.
మాదక ద్రవ్యాలు, మానసిక ప్రభావాలు కలిగించే పదార్థాలు (ఎన్‌డీపీఎస్) చట్టంలోని 27 (బీ), 29 సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు పక్కా ఆధారాలతో టామ్ చాకోను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కాగా పోలీసుల వాదనను నటుడు తోసిపుచ్చారు.
అరెస్టు అనంతరం నటుడిని ఎర్నాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. షైన్ టామ్ చాకో రక్తం, గోళ్లు, వెం ట్రుకలు మొదలైన నమూనాలు సేకరించా రు. కోర్టు బెయిల్ మంజూరు చేసినా ఏప్రిల్ 22న తమ ఎదుట విచారణకు రావాలని పోలీసులు షైన్‌కు నోటీసులిచ్చారు.