- సాత్విక్ జోడీ, ప్రణయ్ శుభారంభం
- మలేషియా ఓపెన్ టోర్నీ
కౌలాలంపూర్: భారత యువ షట్లర్ మాళవిక బన్సోద్ మలేషియా ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్‌లో మాళవిక ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో మాళవిక 21-15, 21-16తో స్థానిక క్రీడాకారిణి గోహ్ జిన్‌ను ఓడించింది. ప్రీ క్వార్టర్స్‌లో మాళవిక చైనాకు చెందిన మూడో సీడ్ యూ హాన్‌ను ఎదుర్కోనుంది.
పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ కూడా ముందంజ వేశాడు. రూఫ్ టాప్ లీకేజీతో నేటికి వాయిదా పడిన మ్యాచ్‌లో ప్రణయ్ 21-12, 17-21, 21-15తో కెనడాకు చెందిన బ్రియాన్ యాంగ్‌ను చిత్తు చేశాడు. ప్రీక్వార్టర్స్‌లో ప్రణయ్ చైనాకు చెందిన షి ఫెంగ్‌ను ఎదుర్కోనున్నాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట శుభారంభం చేసింది.
తొలి రౌండ్‌లో ఈ జోడీ 21-10, 16-21, 21-5తో కొరియాకు చెందిన టాంగ్-లూ జంటపై విజయాన్ని అందుకొని ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. సాత్విక్ జోడీ తర్వాతి రౌండ్‌లో మలేషియా ద్వయం కియోంగ్- అజ్‌రిన్ అయూబ్‌తో తలపడనున్నారు.
మరో మ్యాచ్‌లో ప్రియాన్షు రజావత్ ఓటమి పాలవ్వగా.. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్, అనుపమకు ఓటములే ఎదురయ్యాయి. మహిళల డబుల్స్ విభాగంలో తనీశా, రుతపర్ణ జోడీలు ఓటమిలు చవిచూశాయి. మిక్స్‌డ్ డబుల్స్‌లో సతీశ్-ఆధ్య, తనీశా-ధ్రువ్ కపిల జంటలు ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టాయి.