వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ అధ్యక్షులు వడ్లమూరి పిలుపు..
ముషీరాబాద్ (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయడానికి నిరసనగా ఈనెల 14న తెలంగాణా రాష్ట్ర బంధు పాటించాలని మలహానాడు జాతీయ అధ్యక్షుడు డా.వీఎల్.రాజు తెలంగాణ రాష్ట్ర మాల సమాజానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ అధ్యక్షులు, సుప్రీం కోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ తో కలసి ఆయన మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ జస్టిస్ షామీర్ అక్తర్ నివేదికను ఆమోదించే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రాజ్యాంగ నిబంధనలు పాటించలేదన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ ను ఆర్టికల్ 338 ప్రకారం సంప్రదించకుండా ఏకపక్షంగా ఎస్సీ వర్గీకరణకు పూనుకున్నారని విమర్శించారు.
ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేయడంలో భాగంగా మోడీ ఆదేశాల మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కుట్రలు పన్ని, సామాజిక డ్రామా రాజకీయ కుట్రలకు పాల్పడి మాదిగ కులస్థులకు అత్యధికంగా రిజర్వేషన్ 9 శాతం కేటాయించి, మాల కులస్తులను తక్కువ జనాభాగా చూపి మాలలను అణిచివేయడానికి సిద్ధం అయ్యారన్నారు. ఈ నివేదిక అమలును నిలిపివేయాలని కోరుతూ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డా.విఎల్.రాజు తెలంగాణ రాష్ట్ర హై కోర్ట్ లో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జెఎన్.రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవేందర్ రావు, న్యాయవాది గోలి నరేష్, డిబిపి నాయకులు చిపర్తి సుబ్బారావు, పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బుంగా జయరాజు పాల్గొన్నారు.