- రెడ్డి జాగృతి సదస్సులో మందకృష్ణమాదిగ
- మాదిగల అంతిమ యుద్ధానికి అందరూ సహకరించాలని వినతి
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 21 (విజయక్రాంతి): కాంగ్రెస్‌లో మాలల ఆధి ఎక్కువ అని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష ్ణమాదిగ ఆరోపించారు. మంగళవారం రెడ్డి జాగృతి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ‘న్యాయమైన ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా రెడ్ల సదస్సు’ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతి పాల్గొన్న మందకృష్ణమాదిగ మాట్లాడు ఎస్సీ వర్గీకరణ కోసం తాము చేస్తున్న మాదిగల అంతిమ యుద్ధానికి అందరూ సహకరించాలని కోరారు. ఎస్సీల్లో 59 కులాలుంటే అందరూ పంచుకోవాలని 58 కు కోరుతుంటే.. ఒక కులం మాత్రమే దాన్ని వ్యతిరేకిస్తోందని విమర్శించారు.
ఆ కులానికి చెందిన ఒక్క కుటుంబమే కాంగ్రెస్‌లో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీగా ఉన్నారని ఆరోపించారు. ఇప్పటికీ మాదిగలు తీవ్రపేదరికం, వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గాయకుడు గద్దర్ నర్సన్న, రెడ్డి జాగృతి నాయకులు, ఎమ్మార్పీఎస్, వివిధ ప్రజాసంఘాల నాయకులు, పాల్గొన్నారు.