calender_icon.png 5 January, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ను కలిసిన మాల సంక్షేమ సంఘం నేతలు

02-01-2025 04:18:11 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఉట్నూరు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel)ని ఆదిలాబాద్ జిల్లా మాల సంక్షేమ సంఘం నేతలు(Mala Welfare Association Leaders) గురువారం కలిశారు. సంఘం అధ్యక్షులు కొప్పుల రమేష్ ఆధ్వర్యంలో  ఎమ్మెల్యే ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు(Happy New Year) తెలియజేశారు. అనంతరం మాల కులస్తుల సమస్యలపై ఎమ్మెల్యే తో చర్చించారు. అదేవిధంగా ఉట్నూరు అడిషనల్ ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన కాజల్ సింగ్ ని నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.  కార్యక్రమంలో సంఘం నాయకులు బేరా దేవన్న, పాశం రాఘవేంద్ర, మొట్టె కిరణ్, ఉపాధ్యక్షులు కాటం రమేష్, కోడి ప్రభాకర్,  సుశీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.