calender_icon.png 31 January, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వటం మరిచారు

30-01-2025 07:35:44 PM

జిల్లా మాల మహానాడు అధ్యక్షులు అల్లాడి పౌల్ రాజ్

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం ఏఎంసి కాలనీ నందు గురువారం మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం డేగల శివ అధ్యక్షతన నిర్వహించటం జరిగింది. ఈ సమావేశానికి మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అల్లాడి పౌల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ... తరాలు మారిన, యుగాలు మారిన దళితుల తలరాతలు మారటం లేదని, ప్రభుత్వం అర్హులు కానీ వారికి డబల్ బెడ్ రూమ్ లు ఇచ్చి పేదలకు డబుల్ బెడ్ రూమ్ మరిచారని అన్నారు. గత 15 సంవత్సరాలుగా అద్దెలకి ఉండే పేదలకు డబల్ బెడ్ రూమ్ దక్క కుండా చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. గత ప్రభుత్వంలో డబల్ బెడ్ రూము ఇల్లు రాని పేదలు  ఈ ప్రభుత్వంలోనైనా డబల్ బెడ్ రూములు వస్తాయని ఆశ పడిదే కొంత మంది దళారులు పేదల సొంతింటి కలను సొమ్ము చేసుకుంటూ తమ సామాజిక వర్గానికి ఇచ్చుకుంటూ రాజకీయ బలంతో మేమే నాయకులం మేము చెప్పిందే వేదం అని ఇష్టానుసారం గా వ్యహరిస్తున్నారు. పేదలు  అద్దెలు నెలకి 4000 రూపాయలు అద్దె కట్టలేక జీవిస్తున్న వారు చాలా మంది ఉన్నారని, డబల్ బెడ్ రూమ్ ప్రక్రియ ను రెవిన్యూ అధికారులు ఎమ్మార్వో ఆర్ఐ చొరవ చూడాలి, ఎమ్మెల్యే  తెల్లం వెంకటరావు  పోదెం వీరయ్య  పేదల ఇంటి కల నెరవేర్చినందుకు  ప్రభుత్వంతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదిగిన ఇల్లు ఇప్పించాలని కోరారు. కోరుతున్నారు.ఈ సమావేశం లో ప్రమీల, రాజు, మేరీ ,బర్ల రామకృష్ణ, దాసరి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.