ఖమ్మం,(విజయక్రాంతి): డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోమంత్రి అమిత్‌షా చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం మాలమహానాడు కార్యకర్తలు ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ముట్టిడించేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు విఫలం చేశారు. జిల్లా మాలనాడు కార్యకర్తలు ప్రదర్శనగా వచ్చి, బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా, ముందుగానే అక్కడికి చేరుకున్న పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్లు అదుపులోకి తీసుకుని,పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా పోలీసులకు, మాల మహానాడు కార్యకర్తల మధ్య కొద్దిసేపు తోపులాట జరగడంతో ఉద్రిక్తత పరిస్ధితి ఏర్పడింది. దీంతో పోలీసులు, కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అమిత్‌షా రాజీనామ చేయాలంటూ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంలోకి దూసుకుపోయే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సందర్బంగా మాలమహానాడు నాయకులు మాట్లాడుతూ... అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని రచించి, ఆరాధ్యదైవంగా భావిస్తున్న అంబేద్కర్‌ను కించేపర్చే విధంగా మాట్లాడడం దారుణమన్నారు. అమిత్‌షాను వెంటనే పదవి నుంచి తొలగించి, దేశ ప్రజల మనోభావాలను కాపాడాలని కోరారు.