నిర్మల్,(విజయక్రాంతి): స్వర్గీయ ప్రజానౌక గద్దర్(Gaddar)పై అనుచిత వాక్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్(Union Home Minister Bandi Sanjay)పై చర్యలు తీసుకోవాలని ఆయన వెంటనే ఆ కుటుంబానికి క్షమాపన చెప్పాలని డిమాండ్ చేస్తూ గురువారం నిర్మల్‌లో మాల సంఘం నాయకులు(Mala Leaders) నిరసన నిర్వహించారు. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తు మాల సంఘం నేతలు, కార్యాకర్తలు, బండి సంజయ్ దిష్టి బొమ్మ(Bandi Sanjay Dashti Effigy)తో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ముందు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చూస్తు దిష్టి బొమ్మను దగ్ధం చేశారు దిళితుడైన గద్దర్ కుటుంబంను విమర్శించడంపై క్షమాపన చెప్పాలన్నారు. లేకుంటే బండి సంజయ్ కార్యాక్రమాలను అడ్డు కొంటామని హెచ్చరించారు. ఈ కార్యాక్రమంలో నాయకులు రంజిత్ వెంకటస్వామి, మురళిధర్, పురుషోత్తమ్, నవీన్, గంగాధర్, తదితరులు ఉన్నారు.