calender_icon.png 29 November, 2024 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇవి ప్రేమ భాషలు!

29-11-2024 12:00:00 AM

ప్రేమ భాషల గురించి వినే ఉంటారు. ప్రేమికులు వాడే కమ్యూనికేషన్‌ని ప్రేమ భాష అంటారు. ఒక్కొక్కరు ఒక్కోలా తమ ప్రేమను వ్యక్తీకరిస్తారు. కొంతమంది పదాల్లో చెబితే మరికొందరు స్పర్శతో చెబుతారు. ఇవన్నీ కూడా ప్రేమ భాషల్లో రకాలే. ప్రేమించే వ్యక్తు ల పట్ల చూపించే ఆప్యాయత కూడా ఒక ప్రేమ భాష. ఒక్కో వ్యక్తి ఒక్కోలా తమ ప్రేమను వ్యక్తీకరిస్తాడు. తమ ప్రేమను కమ్యూనికేట్ చేస్తారు. ఇవన్నీ ప్రేమ భాషల్లోకి వస్తాయి. 

ప్రపంచంలో ఎన్నిరకాల ప్రేమ భాషలు ఉన్నాయో తెలుసుకోవడం కోసం అధ్యయనాలు జరిగాయి. ఇప్పటివరకు ఐదు రకాల ప్రేమ భాషలు ఉన్నట్టు అధ్యయనం తేల్చింది. అయితే కొత్తగా చేసిన మరొక అధ్యయనంలో ఏడు ప్రేమ భాషలు ఉన్నాయని తెలుస్తోంది. తమ ప్రేమను ఎదుటి వ్యక్తికి తెలియజేడయమే వారి ముఖ్య ఉద్దేశ్యం. 

మాటలతో చెప్పడం

కొంతమంది తమ ప్రేమను మాటల ద్వారానే వ్యక్తీకరిస్తారు. రకరకాల పొగడ్తలతో వారిని ప్రశంసిస్తారు. మెసేజ్‌ల రూపంలో వారికి తమ మనసులోని మాటను చెబుతారు. డిజిటల్ కమ్యూనికేషన్ వాడి అందమైన మెసేజ్‌లు పెడుతుంటారు. ఎలా చేసినా వారు పదాలతోనే తమ ప్రేమను వ్యక్తీకరిస్తారు. కాబట్టి ఇదొక రకమైన ప్రేమ భాషగా చెప్పుకోవచ్చు. 

సమయాన్ని కేటాయించడం

ప్రేమించిన వ్యక్తి కోసం సమయాన్ని కేటాయించడం కూడా ప్రేమ భాష కిందే లెక్క. భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది వారు తమలోని ప్రేమను వ్యక్తీకరించడమే. అలాగే వారితో కలిసి సమయం గడిపేందుకు ఇష్టపడుతూ ఉంటారు. వాళ్లు చెబుతున్నది వినడానికి ఇష్టపడతారు. 

సేవ చేయడం

ప్రేమించిన వ్యక్తికి ఆరోగ్యం బాగోలేనప్పుడు లేక అవసరమైనప్పుడు కొన్ని రకాల పనులు చేయడం ద్వారా తమలోని ఇష్టాన్ని, ప్రేమను వ్యక్తీకరిస్తారు. హెల్త్ బాలేనప్పుడు కావాల్సిన ఆహార పదార్థాలను వండి పెడతారు. వారి పనుల్లో సాయం చేస్తారు. ఇవన్నీ కూడా ప్రేమ భాష కిందకి వస్తాయి. 

బహుమతులు ఇవ్వడం

బహుమతుల ద్వారా కూడా ప్రేమను వ్యక్తపరుస్తారు. కొందరు ఖరీదైన బహుమతులు కొంటే మరికొందరు సింపుల్ గిఫ్ట్స్ ఇస్తారు. అవి ప్రేమను ప్రతిబింబించేలా ఉంటాయి. ఇలా బహుమతులు ఇవ్వడం కూడా ఒకరకమైన ప్రేమ భాషేనని అధ్యయనంలో తేలింది. 

అందమైన స్పర్శ

ప్రేమలో స్పర్శ ఎంతో ముఖ్యమైనది. ఏడుస్తున్నవారికి ఒక్క కౌగిలింత ఎంతో సాంత్వనగా ఉంటుంది. కాబట్టి శారీరక స్పర్శను తక్కువ అంచనా వేయకూడదు. కొందరు తమ ప్రేమను వ్యక్తీకరించడానికి కౌగిలింతలు, ముద్దులు ద్వారా చెబుతారు. ప్రేమ భాషల్లో భౌతిక స్పర్శ కూడా ఒకటి.