calender_icon.png 19 April, 2025 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అశ్లీల వీడియోలు తీసి.. వెబ్‌సైట్లకు అమ్ముతూ..

17-04-2025 01:42:02 AM

నగ్నవీడియోలను లైవ్‌స్ట్రీమ్ చేస్తున్న ముఠా అరెస్ట్

గుంటూరులో నిందితుల అరెస్ట్ చూపిన సీఐడీ పోలీసులు

గుంటూరు, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): నగ్న వీడియోలను లైవ్‌స్ట్రీమ్(ప్రదర్శిస్తూ) చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు సీఐడీ ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. బుధవారం స్థానిక సీఐడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐడీ ఐజీ మాట్లాడారు.గుంతకల్లుకు చెందిన లూయిస్ అనే వ్యక్తి కాల్‌సెంటర్ నడుపుతూ అక్కడ పనిచేస్తున్న వారితో బలవంతంగా అశ్లీల వీడియోలు తీస్తున్నారని తెలిపారు. వాటిని నిషేధిత వెబ్‌సైట్లకు అమ్ముతూ సొమ్ముచేసుకుంటున్నారన్నారు. సైప్రస్ దేశానికి చెందిన వెబ్‌సైట్  నిర్వాహకులు ఈ వీడియోలకు క్రిప్టోకరెన్సీ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు చేస్తున్నారని తెలిపారు.

లూయిస్‌కు సహకారంగా ఉన్న శ్రీకాకుళానికి చెందిన గణేశ్, జ్యోత్స్నను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. లైవ్ స్ట్రీమింగ్ కోసం ఉపయోగించిన ఫోకస్ లైట్, వెబ్ కెమెరాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇలాంటి సైబర్ నేరాల పట్ల మహిళలు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఐడీ ఎస్పీ కే కృష్ణప్రసన్న మాట్లాడుతూ..అనుమానాస్పద కార్యకలాపాలు చేపట్టేవారు కనిపిస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి సమాచారం అందించవల్సిందిగా ఆమె కోరారు. ఈ కేసును వేగంగా ఛేదించిన సీఐలు ఆర్‌ఎస్ మధుబాబు, శ్రీనివాసులు,సిబ్బందిని అభినందించారు.