మగువలు మేకప్ విషయంలో రాజీపడటం లేదు. దీంతో బ్యూటీ ప్రొడక్ట్స్ చాలానే కొంటున్నారు. తీరా అవి కొన్నాళ్లకే విరిగిపోవడమో, పాడు అవ్వడమో జరిగితే.. జరుగుతుంది. మళ్లీ వాటిని కొనలేం కదా.. మరేం చేయాలంటారా?
* కొన్నిసార్లు లిప్‌స్టిక్ తేమకోల్పోయి గట్టిగా అవుతుంది. రంగూ మారిపోతుంది. ఇలాంటప్పుడు ఒక రెండు నిమిషాలు వేడినీటిలో ఉంచండి. మృదువుగా మారడమే కాదు మంచి ఛాయలోనూ కనిపిస్తుంది. విరిగిపోయిన లిప్‌స్టిక్ అతుక్కోవాలంటే.. దాన్ని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచితే చాలు.. మళ్లీ కొత్తగా వాడుకోవచ్చు.
* కాంపాక్ట్ పౌడర్ సగం వాడాక పొడిబారి విడిపోతుంది. ఇలాంటప్పుడు కాస్త రబ్బింగ్ ఆల్కహాల్‌ని జతచేసి ఆ బాక్స్‌లో సర్దితే సరి. చక్కగా కొత్తదానిలా కనిపిస్తుంది.
* సీసా నిండా మస్కారా ఉన్నా అది కొన్నిసార్లు వాడటానికి పనికిరాదు కారణం పొడారిపోవడమే. ఇలాంటప్పుడు కొన్ని చుక్కల బాదం నూనెను వేసి బాగా కలిపి.. ఓ రెండు గంటల తర్వాత వాడుకుంటే సరి. చక్కగా వస్తుంది.