calender_icon.png 19 March, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్మం మెరిసేలా..

02-03-2025 12:00:00 AM

చర్మం కమిలిపోయినట్టు.. నిర్జీవంగా కనిపిస్తుందా? చర్మాన్ని మృదువుగా.. కాంతివంతంగా మార్చుకోవాలనుకుంటున్నారా? ఇంట్లోనే అందుబాటులో ఉండే పచ్చిపాలను ఉపయో గించి మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. 

* రెండు చెంచాల పచ్చిపాలల్లో ఒక చెంచా తేనె, చెంచా పసుపు కలిపి మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. దీన్ని 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మం హైడ్రేట్ అవుతుంది. 

* అరటి పండు గుజ్జులో రెండు చెంచాల పాలు కలిపి.. ముఖానికి అప్లు చేసి.. 20 నిమిషాల తర్వాత కడిగితే.. మంచి ఫలితం ఉంటుంది. ఈ మాస్క్ చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. 

* రెండు చెంచాల గులాబీ నీళ్లల్లో పచ్చిపాలను కలి పి ముఖానికి స్ప్రే చేయాలి. ఈ టోనర్‌ను 10 నిమిషాల తర్వా త కడగాలి. ఇది చర్మం పీ హెచ్ స్థాయిని సమతుల్యం చేస్తుంది. 

* రెండు చెంచాల పచ్చిపాలను ముఖంపై సర్క్యూలర్ మోషన్‌లో రాసుకోవాలి.  తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే.. ముఖంపై ఉండే దుమ్ము, ధూళి కణాలు పూర్తిగా తొలగిపోతాయి.