- ప్రపంచం మెచ్చిన ఆర్థికవేత్త మన్మోహన్‌సింగ్
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): దివంగత మాజీ ప్రధాని మన్మో హన్‌సింగ్ ప్రపంచం మెచ్చిన ఆర్థికవేత్త, సం స్కరణలతో దేశాన్ని అభివృద్ధి బాట పట్టించిన గొప్ప నాయకుడని రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో మన్మోహన్ మృతికి సం తాపం ప్రకటిస్తూ ఆయన మాట్లాడారు.
ఎన్నో అద్భుతమైన చట్టాల రూపకర్త, రాజకీయ నాయకులు ఎంత హూందాగా ఉండా లో చెప్పిన అరుదైన నాయకుడని ప్రశంసించారు. నిజమైన దేశభక్తికి జెండాలాంటి నాయకుడని, ప్రధాని పదవిలో ఉన్నా.. ఇంటి నుంచి సద్ది తెచ్చుకున్న సామాన్యుడన్నారు. 1991లో బంగారం కుదవబెట్టి అప్పు చేయకపోతే ఈ దేశం నడవదు అనే స్థితి నుంచి.. నాలుగు ట్రిలియన్లతో ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థికశక్తిగా మలిచిన ఘనత మన్మోహన్‌సింగ్‌కే దక్కిందన్నారు.
2004 నుంచి 2014 వరకు ప్రధానిగా ఎన్నో రంగాల్లో దేశాన్ని ముందుకు నడిపించారని, ఈ కాలంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 8-9శాతానికి చేరిందన్నారు. ఉపాధి హామీ చట్టం, సమాచారహక్కు చట్టం, విద్యాహక్కు చట్టం ఆయన చలవేనన్నారు. అమెరికాతో పౌర అణు ఒప్పందం కుదిర్చినట్టు వివరించారు.
మన్మోహన్ చొరవతోనే తెలంగాణ సాకారం: మంత్రి సీతక్క
60 ఏళ్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కల నెరవేర్చిన ఘనత, ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గాడిలో పెట్టిన ఘనత దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కే దక్కుతుందన్నారు.
కరోనా సమయంలో ఆయన తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం ప్రజలను ఆదుకుందని, ఆర్‌టీఏ చట్టంతో ప్రజలకు ప్రభుత్వ పనులు తెలుసుకునేలా చేశాడన్నారు. ఆర్థిక స్వాప్నికుడిగా ఎంతో పేరుగాచిన ఆయన సేవలను భారత్ ఎప్పటికీ మరువదన్నారు. పేదలకు ఉన్నత చదువు అందని ద్రాక్షగా ఉన్న సమయంలో దేశ వ్యాప్తంగా 30వేల విద్యాలయాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.