calender_icon.png 25 February, 2025 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగుల క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి

18-02-2025 04:29:27 PM

మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్..

లక్షెట్టిపేట (విజయక్రాంతి): మున్సిపాలిటీలో ఈ నెల 20న నిర్వహించదలచిన దివ్యాంగుల క్యాంపును మున్సిపాలిటీలో అర్హులైన దివ్యాంగులందరూ సద్వినియోగం చేసుకోని దివ్యాంగుల ఉపకరణాలు, సహాయక పరికరాల అందజేత కొరకు మున్సిపల్ పరిధిలోని మార్కెట్ యార్డ్ లో ఉన్న రైతు వేదిక వద్ద క్యాంపు సద్వినియోగం చేసుకోవాలి అని మంగళవారం మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఒక ప్రకటన తెలిపారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ... శారీరక దివ్యాంగులకు, బ్యాటరీ ఆపరేటర్ ట్రై సైకిల్, చేతి కర్రలు, చంక కర్రలు, వీల్ చైర్స్, మూడు చక్రాల సైకిల్లు, చెవిటి, మూగ దివ్యాంగులకు, చెవి వెనుక ధరించి వినికిడి యంత్రాలు, అంద దివ్యాంగులకు స్మార్ట్ కేన్, అందుల చేతి కర్ర, అంధ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్స్, మానసిక దివ్యాంగులకు ఎం.ఎస్.ఐ.ఈ. డి. కిట్ లేదా ఎం.ఆర్ కిట్ ఇవ్వబడును అని అన్నారు.

బ్యాటరీ ఆపరేటర్ ట్రై సైకిల్ పొందడానికి 80% శారీరక వికలాంగత్వం (చేతులు బాగుండి కాళ్ల వికలాంగత్వం కలిగి ఉన్న దివ్యాంగులకు మాత్రమే) మిగిలినవి 40% శారీరక అంగవైకల్యం కలిగిన వారికి ఉపకరణాలు, సహాయక ఉపకరణాలు పొందుటకు అర్హులు. క్యాంపుకు వచ్చేవారు వారితో పాటుగా సదరం సర్టిఫికేట్, సదరం సర్టిఫికెట్ లేనిచో ఫిజీషియన్ ధ్రువీకరించిన ధ్రువపత్రం, యూ.డి.ఐ.డి కార్డు, రేషన్ కార్డ్, ఆహార భద్రత కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఓటర్ ఐ.డి తదితర ధ్రువీకరణ పత్రాలతో దివ్యాంగులందరూ ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోగలరు అని తెలిపారు.