11-03-2025 04:35:02 PM
టీయూడబ్ల్యూజే అధ్యక్ష, కార్యదర్శులు దత్తెందర్, బిజి రామాంజనేయులు
మహబూబ్నగర్: టీయూడబ్ల్యూజే(ఐజేయు) మహబూబ్నగర్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలని యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దండు దతేందర్, బిజి రామాంజనేయులు జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య హాస్టల్ భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నూతన సభ్యత్వాల నమోదు, జిల్లా మహాసభల నిర్వహణపై చర్చించనున్నట్లు వెల్లడించారు.
సమావేశానికి జిల్లా కేంద్రంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా స్టాఫర్లు, బ్యూరోలు, ఫోటో అండ్ వీడియో జర్నలిస్టులు అందరూ హాజరై తమ విలువైన సూచనలు సలహాలు అందించి యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ హాజరుకానున్నట్లు తెలిపారు. సమావేశంలో యూనియన్ నాయకులు పేట వెంకటయ్య, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.