calender_icon.png 1 March, 2025 | 10:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి అమరవీరుల సభను జయప్రదం చేయండి

01-03-2025 12:57:40 AM

 వైరా, ఫిబ్రవరి 28 ( విజయక్రాంతి ):  మాదిగ జాతి హక్కుల సాధన కోసం మాదిగ జాతికి రావాల్సిన న్యాయమైన వాటా దక్కాలని, 30 ఏళ్లుగా కొనసాగిన పోరాటంలో అసువులు బాసిన మాదిగ అమరవీరుల సంస్కరణ సభను విజయవంతం చేయాలని వైరా ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాలు పిలుపునిచ్చాయి..

వైరాలో శుక్రవారం  జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ శనివారం వైరా రింగ్ రోడ్ లో ఉదయం 11 గంటలకు మాదిగ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహిస్తున్నామని వారు తెలిపారు . గాంధీభవన్ ముట్టడిలో మాదిగ బిడ్డలు మంటల్లో ఆహుతి అయ్యారని, వర్గీకరణ ఆశయంతో ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలను స్మరించుకుంటూ  సంస్కరణ సభను విజయవంతం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారు తెలిపారు..

మాదిగ సమాజం వారి త్యాగాలు గుర్తించి వారికి నిజమైన నివాళులర్పించాలని అన్నారు.ఎమ్మార్పీఎస్ నాయకులు కోట కోటేశ్వరరావు మాదిగ, కంచర్ల వెంకటేశ్వర్లు మాదిగ, మాగంటి బాబు మాదిగ, మోదుగు రమేష్ మాదిగ, కారుమంచి వెంకన్న మాదిగ, కర్ష రమేష్ మాదిగ, ఇండ్ల వెంకట్ మాదిగ, తేల్లూరి  పుల్లారావు మాదిగ, ఆనందరావు మాదిగ, రాజేష్ మాదిగ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు..