10-04-2025 12:25:46 AM
మణికొండ మున్సిపల్ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంభగళ్ల ధన్ రాజ్
రాజేంద్రనగర్, ఏప్రిల్ 9: బిఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చలో వరంగల్ సభను విజయవంతం చేయాలని మణికొండ మున్సిపల్ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంబగళ్ల ధనరాజ్ పిలుపునిచ్చారు. మణికొండ మున్సిపల్ నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలి వెళ్ళనున్నట్లు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును అగ్ర నేతలు ఎండ కడతారని ఆయన చెప్పారు.
రాబోయే రోజుల్లో బిఆర్‌ఎస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుం దని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని తూర్పారబట్టారు.