08-04-2025 01:01:21 AM
గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వెంకటేష్ చౌహన్
ముషీరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని బషీర్ బాగ్ చౌరస్తా బాబు జగ్జీవన్ రావ్ విగ్రహం నుండి ట్యాంక్ బండ్ లోనీ సచివాలయం పక్కన ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు, అలాగే ప్రజా సంఘాలు, విద్యా ర్థి సంఘాలు కళాకారులతో భారీ ఎత్తున గిరిజన శక్తి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రక్షణకై భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెంకటేష్ చౌహన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు సంఘాల నాయకులతో కలిసి మాట్లాడుతూ నేడు భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పేద అణగారిన, గిరిజన దళిత బహుజన వర్గాలకు అన్యాయం చేస్తూ భవిష్యత్తులో వారికీ రిజర్వేషన్లను లేకుండా చేయాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు.
గిరిజనుల భాషలను గుర్తించకుండా అవమానిస్తుం దని, ఎన్నో ఏళ్ల నుంచి బంజారా భాష ‘గోర్ భోలి‘ని 8 వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్న పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో డాక్టర్ రాజేష్ నాయక్, గిరిజన శక్తి రాష్ట్ర నాయకులు కార్తీక్ నాయక్, భరత్, ఈ ర్యాలీకి మద్దతుగా తెలంగాణ ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షు లు ఐతరాజు అభేందర్, దళిత్ యూత్ ఫోర్స్ అధ్యక్షులు కొండ్రపల్లి రమేష్, ప్రైవేట్ ఉద్యోగులు సంఘం సందీప్, నరేందర్, బీసీ నాయకులు వేమూలూరి అనిల్ చారి మద్దతు నాయకులు హైదరాబాద్ ఇంచార్జ్ చిరంజీవి నాయక్, మున్నా నాయక్, శంకర్ నాయక్, శ్రీమన్ నాయక్, హెచ్‌సియు విధ్యార్థి నాయకుడు ప్రవీణ్ నాయక్, శివా చౌహన్, హెచ్ సియు శంకర్ నాయక్, గిరిజన నాయకులు తరుణ్. నిఖిల్, భరత్, ఉమేష్, సోమేశ్ తదితరులు పాల్గొన్నారు.