ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్ ఆదేశం
నాగార్జునసాగర్ జల విద్యుత్తు కేంద్రం సందర్శన
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): నాగార్జునసాగర్ జల విద్యుత్తు కేంద్రంలో రెండో యూనిట్ మినహా మిగతా యూనిట్లన్నీ పూర్తి సామర్థ్యంతో పనిచేయడంపై ఇంధన శాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ రోనాల్డ్‌రోస్ సంతృప్తి వ్యక్తంచేశారు. అయితే రెండో యూనిట్‌ను కూడా వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని జెన్‌కో అధికా రులను ఆయన ఆదేశించారు. శుక్రవా రం నాగార్జునసాగర్ జల విద్యుత్తు కేం ద్రాన్ని రోనాల్డ్ రోస్ సందర్శించారు.
ఈ సందర్భంగా మొత్తం 8 యూనిట్లలో 7 యూనిట్లు (ఒక్కొక్కటి 100 మెగావాట్లు) మాత్రమే సర్వీసులో ఉన్నాయని అధికారులు వివరించారు. జనరేటర్ రోటర్ స్పైడర్ లోపంతో అది సర్వీసులో లేదని అధికారులు కార్యదర్శిరికి వివరించారు. ప్రస్తుతం అందుబాటులో లేని 2వ యూనిట్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.