కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీ ఉన్నత పాఠశాలలో ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించే జిల్లా స్థాయి ఇన్స్పైర్ మనాక్, బాల వైజ్ఞానిక ప్రదర్శనలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా నియమించిన కమిటీల వారు అంకితభావంతో కృషిచేసి విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. యాదయ్య సూచించారు. వైజ్ఞానిక ప్రదర్శనల సన్నాహక సమావేశాన్ని మంగళవారం సెంట్ మేరీ పాఠశాలలో వివిధ కమిటీల బాధ్యులతో కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 108 ఇన్స్పైర్ మనిక్ ప్రాజెక్టులు, 200 పైగా బాల వైజ్ఞానిక ప్రదర్శనలు ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్నట్లు తెలిపారు. సుమారు 400 మంది జిల్లాలోని విద్యార్థులు, గైడ్ టీచర్లు తమ ప్రాజెక్టులతో పాల్గొని నూతన ఆవిష్కరణలను ప్రదర్శించనున్నట్లు వివరించారు. ఇందుకు అవసరమైన భోజన వసతి, అకామిడేషన్, నీటి వసతి కల్పించే విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా శ్రద్ధ వహించాలని సంబంధిత కమిటీల వారిని కోరారు. విద్యార్థులకు గైడ్, టీచర్లకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు.