calender_icon.png 13 February, 2025 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాగొంతుకలను గెలిపించండి

13-02-2025 12:00:00 AM

చేర్యాల, ఫిబ్రవరి 12:  ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థులను స్థానిక సంస్థల్లో గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి పిలుపునిచ్చారు. చేర్యాల పట్టణంలోని సిపిఎం కార్యాల యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమా వేశంలో మాట్లాడుతూ పోరాడే గొంతు కలకు మద్దతుగా నిల్వాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, స్థానిక సమస్య లపై ఎప్పటికప్పుడు స్పందించి, తమ పార్టీ నాయకులు సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు.

ప్రజల్లో ఉండే నాయకులను గెలిపిస్తే, సమస్యలు పరి ష్కారం అవ్వడమే కాక గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇతర పార్టీల నాయ కులు తమ స్వార్థం కోసం తప్ప ప్రజా సమస్యల గురించి పట్టించుకోరు అన్నారు. సిపిఎం నాయకులు  సమస్య పరిష్కార మయ్యే వరకు ముందుండి పోరాటం చేస్తారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు శెట్టిపల్లి సత్తిరెడ్డి, శశిధర్, కొంగర వెంకట్ మావో, బద్దిపడగ కృష్ణారెడ్డి, బండ కింది అరుణ్ పాల్గొన్నారు.