calender_icon.png 22 February, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమయం సద్వినియోగం చేసుకోండి

18-02-2025 12:39:25 AM

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి) : విద్యార్థులు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచి మార్కులు సాధించేలా చదవాలని మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ అన్నారు.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సమకూర్చిన ఆదివారం జిల్లా కేంద్రంలోని సన్ షైన్ హైస్కూల్, స్టేయిన్లీ మాడల్ స్కూల్, లిటిల్ రోజ్ హైస్కూల్, చాణక్య హైస్కూల్, బ్రిలి యంట్ హైస్కూల్ లలో డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ పంపిణీ చేశారు.

పదవ తరగతి ఉన్నత చదువులకు ఫౌండేషన్ కోర్సు లాంటిదని, పదవ తరగతి లోని సంబంధించిన అన్ని సబ్జెక్టులు మంచిగా చదివితేనే ఉన్నత చదువులకు ఎలాంటి ఇబ్బందు లూ రావని  చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు శాంతన్న యాదవ్, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.