సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు యాదిరెడ్డి
అబ్దుల్లాపూర్‌మెట్, జూలై 24: ఈ నెల 26 ఇందిరా పార్క్ వద్ద భవన నిర్మాణ కార్మికులు నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు యాదిరెడ్డి, ఏఐటీయూసీ కార్యవర్గ సభ్యులు పిలుపునిచ్చారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ముత్యాల యాదిరెడ్డి మాట్లాడారు. తాంబూ సిస్టం రద్దు చేయాలని, కార్మికులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ప్రమా దవశాత్తు మరచించిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, కార్మికుల కూతురు పెళ్లికి రూ.1 లక్ష ఇవ్వాలని కోరారు.
భవన నిర్మాణ కార్మికులందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాలో కార్మికు లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐటీయూసీ బీవోసీ రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి ప్రసాద్, ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు కేతరాజు నర్సింహ, డవుల రాములు, శ్రీనివాస్, సాగర్, మహేందర్, దండ్ర శ్రీను తదితరులు పాల్గొన్నారు.