calender_icon.png 25 March, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జంతర్ మంతర్ వద్ద జరిగే మహా ధర్నాను జయప్రదం చేయండి

22-03-2025 08:26:34 PM

భవన నిర్మాణ కార్మికులకు జిల్లా అధ్యక్షుడు వేర్పుల మల్లికార్జున్ పిలుపు..

చర్ల (విజయక్రాంతి): కార్మిక సమస్యల పరిష్కారానికై ఈనెల 28న ఢిల్లీలోని జంతర్ మద్దర్ వద్ద తలపెట్టిన ధర్నాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని భవన నిర్మాణా కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు వేర్పుల మల్లికార్జున్ కోరారు. శనివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో గుంజి మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో అయన పాల్గొని మాట్లాడారు. సంక్షేమ బోర్డు పథకాల లబ్ది దారులకు థంబ్ సిస్టమ్ రద్దు చేసి దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

వివాహ కానుక, ప్రసూతి సహాయం రూ.1లక్ష పెంచాలని, సహజ మరణంకు ఇన్స్యూరెన్స్ రూ 6 లక్షలకు పెంచాలని, ప్రమాద మరణానికి రూ 10 లక్ష లకు పెంచాలని సంక్షేమ బోర్డు నిధులు కార్మికుల సంక్షేమం కోసమే వినియోగించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షమానికి మరిన్ని పధకాలను అమలు చేయాలని కోరారు. ఈ సమస్య ల పరిష్కారానికి ఈనెల 28న పార్లమెంటు ముందు జంతర్ మంతర్ వద్ద జరిగె మహ ధర్నాలో కర్మికుల పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.