calender_icon.png 17 April, 2025 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా భూమి రథయాత్రను విజయవంతం చేయాలి

08-04-2025 05:17:48 PM

ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తూరి రవీందర్..

చిట్యాల (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో నిర్వహించనున్న లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర విజయవంతం చేయాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తూరు రవీందర్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో మండల కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. అదిలాబాదులో నిర్వహించనున్న సభకు భూపాలపల్లి జిల్లా నుండి బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి శీలపాక నాగరాజ్, చిట్యాల మండల అధ్యక్షుడు పర్లపల్లి కుమార్, ఉపాధ్యక్షుడు పుల్ల అశోక్, ప్రధాన కార్యదర్శి నేరెళ్ల రమేష్, కార్యదర్శి మట్టే వాడ కుమార్, నవాబ్ పేట గ్రామ అధ్యక్షుడు చిలుముల శశి కుమార్,గ్రామ ఉపాధ్యక్షుడు కృష్ణ, చరణ్ పాల్గొన్నారు.