14-04-2025 01:08:48 AM
సభా స్థలాన్ని ఎస్పీ, ఏఎస్పీతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జు
ఇంద్రవెల్లి, ఏప్రిల్ 13 (విజయక్రాంతి) : అనాడు హక్కులకై పోరుబాటు పట్టి అసువులు బాసిన అమరవీరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కోటి రూపాయలను మంజూరు చేసి అభివృద్ధి పనులను చేపట్టిందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమర వీరుల స్తూపం వద్ద ఈనెల 20న చేపట్టే సభకు సంబంధించిన ఏర్పాట్లను ఎస్పీ అఖిల్ మహాజన్, ఎస్పీ కాజల్ సింగ్, సభ కమిటీ సభ్యులతో కలసి ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ... దళిత గిరిజన దండోరా సభ లో అమర వీరులకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్‌రెడ్డి నెరవేర్చారని, అమర వీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చామ ని తెలిపారు. ఈ సభకు జిల్లా ఇంచార్జి మం త్రి సీతక్క రానున్నట్లు తెలిపారు. 20 ఏప్రిల్ నాడు జరిగిన సభలో కొన్ని అమర వీరుల కుటుంబాలకు ట్రైకార్ ద్వారా 10 లక్షల లోన్లు ఇస్తామన్నారు.
శాంతియుత వాతావరణంలో అమర వీరులకు నివాళులు అర్పించాలని, ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. పాత రగల్ జెండా కమిటినే యధావిదిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సార్మేడిలు, పటేళ్లు, రగల్ జెండా కమిటి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.