calender_icon.png 8 April, 2025 | 1:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి

08-04-2025 12:20:04 AM

బీజేవైఎం జిల్లా నేత కరుణాకర్‌రెడ్డి

చేవెళ్ల, ఏప్రిల్ 7: ఈనెల 12న చేవెళ్ల పట్టణంలో నిర్వహించే వీర హనుమాన్ శోభా యాత్ర కు హిందువులు పెద్ద ఎత్తున తరలి రావాలని బీజేవైఎం జిల్లా నాయకుడు కరుణాకర్ రెడ్డి కోరారు.  సోమవారం చేవెళ్ల మండలం గుండాల గ్రామంలో వీహెచ్ పీ ఆధ్వర్యంలో రూపొందించిన హనుమాన్ జయంతి శోభాయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ  సందర్భంగా ఆయన మాట్లాడు తూ... ప్రతి కార్యకర్త ధర్మం కోసం నిష్టతో పనిచేయాని, పేద, ధనిక, నిమ్న ,అగ్ర వర్ణాల భేదం లేకుండా హిందువులంతా సంఘటితమై నిలబడాలని పిలుపునిచ్చారు.  ఈ కా ర్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు శ్రీనివాస్, శ్రీశైలం, తిరుపతిరెడ్డి, బల్వంత్ రెడ్డి, కుమార్, లింగం పాల్గొన్నారు.