calender_icon.png 23 February, 2025 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టభద్రుల బహిరంగ సభను విజయవంతం చేయండి

23-02-2025 07:31:43 PM

హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఓడితల ప్రణవ్ బాబు..

హుజురాబాద్ (విజయక్రాంతి): పట్టభద్రుల బహిరంగ సభను విజయవంతం చేయాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సోమవారం కరీంనగర్ జిల్లాలో జరిగే పట్టబద్రుల బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతున్నందున ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నది అనీ, మొదటి ఏడాది లోనే 50 వేల పై చిలుకు ఉద్యోగాలు భర్తీ చేసిందని అన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నిరుద్యోగులకి చేసింది ఏమీ లేదు పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు భర్తీ చేయడంలో, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని దుయ్యబట్టారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన చేపట్టి  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నదని అన్నారు. కోదండరామ్ నేతృత్వంలోని జన సమితి పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తుందని అన్నారు. నిరుద్యోగులంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్య ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులని ప్రణవ్ బాబు కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు,పట్టణ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.