calender_icon.png 16 April, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మే 20న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

12-04-2025 11:41:33 PM

సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆకుల రాజు..

మహబూబాబాద్, (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన లేబర్ కోడులు కార్మికులపాలిటీ మరణ శాసనాలని ఆవి అమల్లోకి వస్తే కార్మిక వర్గం కట్టు బానిసలుగా మారతారని వాటిని వెంటనే రద్దు చేయాలని, ఇందుకోసం మే 25 జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని మహబూబాబాద్ జిల్లా సిఐటియు అధ్యక్షులు ఆకుల రాజు పిలుపునిచ్చారు. శనివారం సిఐటియు కార్యాలయంలో వాసం దుర్గారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ సర్కారు కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు బానిసలుగా చేయడం కోసం కొత్త లేబర్ కోడ్లను తీసుకువచ్చారని ఆరోపించారు.

అవి అమల్లోకి వస్తే కార్మికులు యాజమాన్యాలకు బానిసలుగా మారే ప్రమాదం ఉందన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా కార్మిక చట్టాలు, హక్కులు సాధించారని వాటిని రద్దు చేయడం కోసమే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే 12 గంటల పని విధానాన్ని చట్టబద్ధం చేస్తారని, సామాజిక భద్రత పథకాలను తగ్గిస్తారని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి అప్పజెప్తారని ఆరపించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని అన్ని కార్మిక, ఉద్యోగ సంఘాలు ఐక్యమై మే 20వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నాయని దానిలో కార్మిక వర్గం అంతా భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు పట్టణ కన్వీనర్ కుమ్మరి కుంట్ల నాగన్న, కోటేశ్వరరావు, స్నేహబిందు, ఆండాలు, వెంకన్న, రవి, బాలు,జనార్ధన్, హేమ, లక్ష్మణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.