calender_icon.png 11 February, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీయుసీఐ ప్రథమ మహాసభలను జయప్రదం చేయండి

10-02-2025 06:52:26 PM

సంఘటిత రంగలో పనిచేసే హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి..

పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని జిసిసి గోడౌన్ లో హమాలి కార్మికుతో జనరల్ బాడీ నిర్వహించడం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షుడు గోనెల రమేష్ మాట్లాడుతూ... ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా(టియుసిఐ) జిల్లా మహాసభలు కొత్తగూడెంలోని ఉర్దూఘర్ లో ఈనెల 16న నిర్వహిస్తున్నామని, ఆ మహాసభను అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి హమాలి కార్మికులకు, వారి జీవితాలకు భద్రత కరువైందని అన్నారు. కార్మిక సంఘాలు గత సంవత్సరం కాలంగా హమాలి కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్, గాని ఎగుమతులు దిగుమతులు సంబంధించి పెంచుకున్నటువంటి రేట్లను గాని అమలు చేయకుండా తాత్సారం చేస్తుందని అన్నారు.

తక్షణమే కార్మిక సంఘాలతో గత సంవత్సరం ఒప్పందం చేసుకున్నటువంటి పెరిగిన రేట్లను ఈ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన బిజెపి సారధ్యంలోని ఈ ప్రభుత్వం సంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మిక వర్గానికి ఎలాంటి భద్రత లేకుండా చట్టాలను సవరణ చేయడానికి పూనుకుంటుందన్నారు. ఈ చట్టసవరణలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పలు దఫాలుగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించిందన్నారు. కార్మికులకు రక్షణగా ఉన్నటువంటి ఈ కార్మిక చట్టాలను ఎన్నో ఏళ్ళు కార్మిక వర్గం పోరాడి సాధించుకుందని అన్నారు, ఇలాంటి చట్టాలను సవరణలు చేసి మన దేశంలో ఉన్న ఖనిజ సంపదను, కార్మికుల శ్రమను పది శాతం ఉన్న బడా పెట్టుబడి వర్గానికి కట్టపెట్టడానికి చట్ట సవరణలకు పూనుకుందన్నారు.

కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాల ఓట్లతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వాలు ఓడ ఎక్కేదాక ఓడ మల్లయ్య, ఓడ దాటినంక బోడ మల్లయ్య అనే సామెత లెక్క కార్పొరేట్ దిగ్గజాలకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తూ వ్యవహరిస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఒకపక్క మతోన్మాదం పేరుతోటి అభ్యుదయ భావాలు కలిగిన వారిని, సామాజిక కార్యకర్తలను ప్రశ్నించే గొంతులపై దాడి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ ప్రజాస్వామ్యంలో దేశంలో ప్రజలకు రక్షణ లేకుండా చేస్తుందన్నారు. కార్మిక వర్గం పైన కర్షికవర్గం పైన సామాన్య ప్రజల పైన ముప్పేట దాడి కొనసాగిస్తున్న ఇలాంటి తరుణంలో ఈ దాడులకు వ్యతిరేకంగా, కార్మికుల హక్కుల రక్షణ కోసం ఎన్నో సమరశీల పోరాటాలు నిర్వహించిన చరిత్ర కలిగిన టియుసిఐ మన జిల్లాలోని కొత్తగూడెంలో మహాసభలను నిర్వహించుకుంటుందన్నారు. ఈ యొక్క మహాసభలకు సంఘటిత రంగం కార్మికులు, అసంఘటిత రంగం కార్మికవర్గం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టియుసిఐ పట్టణ ఏరియా నాయకులు, హమాలీ కార్మిక సంఘం నాయకులు కుంజా భాస్కర్, నాగేంద్ర, టి సుధాకర్, వెంకటేష్, వీరస్వామి, నాగరాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.