26-04-2025 12:00:00 AM
సీఐటీయూ జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్
దండేపల్లి, ఏప్రిల్ 25 : ఈ నెల 27న ఇప్టు కార్యాలయంలో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే జిల్లా సదస్సును జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ అన్నా రు. మండల కేంద్రంలో శుక్రవారం భూమే ష్ అధ్యక్షతన జరిగిన సీఐటీయు మండల కన్వినింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
మే 20న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ సదస్సుకు సీఐటీయూ అఖిల భారత నాయకు లు సాయి బాబా, రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కోశాధికారి వంగూరి రాము లు హాజరవుతారన్నారు. ఈ సమావేశంలో ఆయా రంగాల నాయకులు పాల్గొన్నారు.