మెదక్, జనవరి 17 (విజయక్రాంతి): సీపీఎం పార్టీ రాష్ట్ర 4 వ మహాసభల సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలో శుక్రవారం పార్టీ జండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ. మల్లేశంమాట్లాడుతూ జనవరి 25 నుంచి 28 వరకు సంగారెడ్డి పట్టణంలో జరుగుతున్న పార్టీ రాష్ట్ర 4 వ మహాసభలను జయప్రదం చేయాలని, మహాసభల సందర్భంగా జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగిందని అన్నారు.
నాలుగు రోజులు పాటు జరిగే మహాసభలలో గత మూడు సంవత్సరాల కాలంలో జరిగిన ప్రజా, కార్మిక ,రైతు ,వ్యవసాయ కార్మికుల పోరాటాలను సమీక్షించి ఫలితాలను చర్చించి గత పోరాట అనుభవాలతో భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందిస్తారని అన్నారు. బహిరంగ సభకు జిల్లా నుండి అత్యధికంగా కార్మికులు, కర్షకులు, ప్రజలు హాజరై మహాసభల బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సంతోష్, నాయకులు అనిల్, షౌకత్ అలీ, రెడ్డి రాజు పాల్గొన్నారు.