మునగాల (విజయక్రాంతి): సిపిఎం సూర్యాపేట జిల్లా 3వ మహాసభల సందర్భంగా ఈ నెల 29వ తేదీన సూర్యాపేట గాంధీ పార్కులో జరుగు బహిరంగ సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని సిపిఎం శాఖకార్యదర్శి మండల కమిటీ సభ్యులు నందిగామ సైదులు పిలుపునిచ్చారు. ఈరోజు మునగాల మండలం కొక్కిరేణి గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ సమావేశం రావుల పెంట బ్రహ్మం అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో నందిగామ సైదులు మహాసభల పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీల పోరాటాలు లేకుంటే పాలకవర్గాలు భూస్వాముల కార్పొరేట్ల బడా పెట్టుబడిదారుల అనుకూల విధానాల అవలంబిస్తూ ప్రజలను దోపిడీ చేస్తాయని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నికరంగా నిలబడి పోరాడేది కమ్యూనిస్టులేనని అన్నారు. నిత్యవసర సరుకుల ధరలు పెంచుతూ ప్రజలపై భారాలను మోపుతూ అంబానీ ఆదాని లాంటి బహుళ జాతి సంస్థలకు, వేలాది కోట్లు ప్రజాధనాన్ని కట్టబెడుతున్నారని విమర్శించారు. మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ఉపసంహరించుకోవాలని మోడీ అండతో ఆదాని డొల్ల కంపెనీల బాగోతం అవినీతి చరిత్ర మరొకసారి బయటపడిందని ఆదానిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.