calender_icon.png 19 April, 2025 | 8:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఐ మండల మహాసభలను జయప్రదం చేయండి

11-04-2025 01:09:43 AM

సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు,

చిలుకూరు, ఏప్రిల్ 10,   ఈనెల 29వ, తేదీన జరగనున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చిలుకూరు మండల మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్య దర్శి బెజవాడ వెంకటేశ్వర్లు కమ్యూనిస్టు శ్రేణులకు పిలుపునిచ్చారు. చిలుకూరు మండల కేంద్రంలోని దొడ్డ నరసయ్య భవన్ లో రెమిడాల రాజు అధ్యక్షతన సిపిఐ చిలుకూరు మండల కౌన్సిల్ సమావేశం జరిగినది.

ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీపీఐ చిలుకూరు మండల మహాసభలకు ముఖ్య అతిథులుగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు  కూనమనేని సాంబశివ రావు, సిపిఐ జాతీయ సమితి సభ్యులు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి పల్లా వెంకటరెడ్డి, సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్,లు పాల్గొంటారని వారు తెలిపారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను అమలుపరచకుండా నిత్యవసర వస్తువుల ధరలను నిత్యం పెంచుతూ పేద మధ్యతరగతి వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయమని అదే విధంగా అర్హులైనటువంటి వారందరికీ రేషన్ కార్డులు అందించి వారికి సన్న బియ్యం అందేలా చర్యలు తీసుకోవా లని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాల ని, బోనస్ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అప్లై చేసుకున్న అర్హులైన వారంద రికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు.

ఈ సమావేశంలో  సిపిఐ చిలుకూరు మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, షేక్ సాహెబ్ అలీ,చేపూరి కొండలు, చిలువేరు ఆంజనేయులు,తాళ్లూరి మల్లయ్య,ముక్కా లక్ష్మీనారాయణ, సాతు లూరి అలివేలు,సిరాపురపు శ్రీనివాసరావు, రెమిడాల జయసుధ, బాల బోయిన రాం బాబు, గురవయ్య, తదితరులు పాల్గొన్నారు.