calender_icon.png 3 April, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలను విజయవంతం చేయండి

02-04-2025 06:28:58 PM

మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో చేపట్టబోయే రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలను ప్రతి గ్రామంలో విజయవంతం చెయ్యాలని మండల కాంగ్రెస్ అధ్యక్షులు ధరాస్ సాయిలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొనాలని కోరారు. గ్రామాల వారిగా చేపట్టే పాదయాత్ర షెడ్యూల్ ను మండల పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు ప్రకటించారు.

పాదయాత్ర షెడ్యూల్ ఈనెల 3న చిన్న షక్కర్గా, సలాబత్పూర్, కేలూర్, 4న తడి ఇప్పర్గా, గోజేగావ్, మేనూర్, శాఖాపూర్, 5న సుల్తాన్ పేట్, లచ్చన్, రూసేగావ్, రాచూర్, 7న పెద్ద ఎక్లారా, ధనుర్, సోమూర్, 8న చిన్న తడగూర్, పెద్ద తడుగూర్, ఖరగ్, ఆవల్గావ్, 9న చిన్న ఎక్లారా, కొడిచరా, గ్రామాల్లో నిర్వహించే రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలకు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొని విజయవంతం కావడానికి సహకరించాలని కోరారు.

పాదయాత్రలకు మండల, గ్రామస్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధం కావాలని  ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్, దేవాదాయ ధర్మాదాయ శాఖ సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్ రామ్ పటేల్, మాజీ ఎంపీపీ ప్రజ్ఞ కుమార్, కొండ గంగాధర్, బండి గోపి, తదితరులు పాల్గొన్నారు.