calender_icon.png 23 November, 2024 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికలాంగుల సదస్సును విజయవంతం చేయాలి

23-11-2024 04:21:12 PM

వికలాంగుల రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్.. 

మునగాల (విజయక్రాంతి): ఈనెల 25న హన్మకొండ జిల్లా కేంద్రంగా జరిగే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ పిలుపునిచ్చారు. శనివారం మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెంలో ఏర్పాటు చేసిన సంఘం మండలం ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేసేందుకు మీన మేషాలు లెక్కిస్తుందని ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా వికలాంగుల సమాజం పట్ల నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తుందని అసెంబ్లీ ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగులకు 6000 పెన్షన్ ఇస్తామని ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తామని వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ గుర్తిస్తామని అన్నారు.

ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకొచ్చి ఏడాది కావస్తున్న వికలాంగులకు ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజాపాలన పేరుతో సంబరాలు చేసుకుంటూ సమాజంలో అట్టడుగులు ఉన్న వికలాంగుల సామాజిక వర్గాన్ని చులకన భావంతో చూస్తున్నారని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేంతవరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రాజీలేని పోరాటం కొనసాగించేందుకుగాను ఈనెల 25న హన్మకొండ జిల్లా కేంద్రంగా జరిగే రాష్ట్ర సదస్సులో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ ప్రకటించి తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపిన ఆయన రాష్ట్ర సదస్సును విజయవంతం చేసేందుకు ఇప్పటినుంచి అన్ని జిల్లాల్లో ఉన్న రాష్ట్ర నాయకులు జిల్లాల అధ్యక్షులు జిల్లాల ముఖ్య నాయకులు సన్నద్ధం కావాలని కోరారు. సంఘ మునగాల మండల అధ్యక్షులు గోపిరెడ్డి మదనమోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గోగుల శేఖర్ రెడ్డి, ఆరూరి బాబు, అల్వాల రమేష్, గుమ్మడేల్లి ఆంజనేయులు, దారావత్ లచ్చు, జక్కరి నర్సమ్మ, భూతం వెంకటమ్మ, పోల్దాస్ బిక్షవమ్మా, శ్రీరాముల లక్ష్మయ్య, ఎల్లబోయిన ఆలియమ్మ, దొడ్ల దశరథ తదితరులు పాల్గొన్నారు.