06-03-2025 08:34:13 PM
భద్రాచలం (విజయక్రాంతి): ప్రతిఘటన పోరాట సారధి కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న) తొమ్మిదవ వర్ధంతి సభ మార్చి 11 ఉదయం 11 గంటలకు ఖమ్మంలో భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించబడుతుందని, దీనికి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ భద్రాచలం హెచ్పి గోడౌన్ సెంటర్లో గురువారం పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ... కామ్రేడ్ రవన్న విద్యార్థి దశ నుంచి 2016 మార్చి 9న మరణించే వరకు 47 సంవత్సరాలు కఠిన కఠోర రహస్య జీవితాన్ని కొనసాగించాడు. న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శిగా మరణించేవరకు కొనసాగాడు.
కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ గోదావరి లోయ ప్రతిఘటన పోరాట ఉద్యమంలో రాయల సుభాష్ చంద్రబోస్ అలియాస్ రవి అలియాస్ రమేష్ గా పోరాటాన్ని కొనసాగించాడనీ, సుదీర్ఘకాలం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కేంద్రకం సభ్యుడిగా కొనసాగినట్టు తెలిపారు. అలాంటి మహోన్నతమైన వీరున్ని స్మరిస్తూ మార్చి 11న ఖమ్మంలో భారీ ప్రదర్శన వర్ధంతి సభ భక్తురామదాసు కళాక్షేత్రంలో ఉంటుందని దీనికి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సభకు ముఖ్య వక్తలుగా ఆవునూరి మధు సాదినేని వెంకటేశ్వరరావు పి ప్రసాద్ ఝాన్సీ కోటేశ్వరరావు గౌని ఐలయ్య నాగన్న తదితరులు పాల్గొన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్, భద్రాచలం డివిజన్ నాయకులు కప్పల సూర్యకాంతం జక్కం కొండలరావు కోట నాగమణి రాధమ్మ సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.