calender_icon.png 22 April, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలో గావ్ అభియాన్ బస్తీ చలో అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

09-04-2025 06:00:31 PM

భాజపా జిల్లా జనరల్ సెక్రెటరీ - పసుమర్తి సతీష్..

చర్ల (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ చర్ల మండల కార్యాలయం నందు మండల అధ్యక్షులు నూప రమేష్ ఆధ్వర్యంలో బుధవారం క్రియాశీల సభ్యుల సమావేశాన్నీ ఏర్పాటు  జరిగినది, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా జనరల్ సెక్రటరీ పసుమర్తి సతీష్ హాజరై మాట్లాడుతూ..  ఏప్రిల్ 10, 11, 12 తేదీలలో చలోగావ్ అభియాన్ బస్తి చలో అభియాన్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించాలన్నారు.

ఈ తేదీలలో గ్రామాలలో మండల క్రియాశీల సభ్యులు తప్పకుండా పర్యటించాలని, అనంతరం14 తారీఖున చర్ల మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించాలన్నారు. పార్టీ సభ్యులు పార్టీని బలోపేతం చేసే ఎలాంటి కార్యక్రమాలలో క్రియాశీల పాత్ర పోషించాలన్నారు. ఈ సమావేశంలో కిసాన్ మోర్చా అధ్యక్షులు ఇర్ప సుబ్బారావు, సీనియర్ నాయకులు శ్రీనివాస చారి, బంధా మధు, బత్తుల వెంకటేశ్వర్లు, విశ్వనాధం, ముత్తారపు రత్తయ్య, మల్లెల ప్రశాంత్, గోపాల సాయి, కుప్ప మాధవరావు, కూరం రమేష్ తదితరులు పాల్గొన్నారు.