calender_icon.png 18 April, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి..

15-04-2025 05:38:03 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం గంగారాం విజ్ఞాన్ భవన్ సిపిఐ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) జిల్లా కార్యదర్శి జాడి పోశం అద్వర్యంలో రాష్ట్ర 4వ మహాసభల వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ... ఈ నెల తేదీ 21, 22న శంషాబాద్, రంగారెడ్డి జిల్లాలో మహాసభలు జరుగుతాయన్నారు. కార్మికులంతా అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వెంకన్న మాట్లాడుతూ... కార్మికుల సమస్యపై  సమస్యల నిర్మూలనపై సూచనలు ఇస్తారని కనుక ప్రతి ఒక్క కార్మికుడు రావాల్సిందిగా కోరారు.

జిల్లా ఉపాధ్యక్షులు కొంకుల రాజేష్ మాట్లాడుతూ.. నిర్మాణ రంగంలో భారతదేశ వ్యాప్తంగా 10 కోట్లకు పైగా కార్మికులు పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వాలు మారిన కార్మికుల సమస్యలు అపరి అపరిస్కృతంగానే ఉన్నాయన్నారు. కనుక సంఘటిత ఉద్యమాల ద్వారానే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని, నిర్మాణ పనుల నుండి ఒక్క శాతం సిస్సు వసూలు చేసి కార్మిక సంక్షేమానికి ఉపయోగించాలని సెస్సు చట్టం నిర్దేశించబడినదని కానీ కార్మికులకు సరైన లబ్ధి చేకూరడంలో జాప్యం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి జాప్యలకు తావివ్వకుండా కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి, మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, బికేఎంయు జాతీయ సమితి సభ్యులు అక్క పెళ్లి బాపు, పట్టణ కార్యవర్గ సభ్యులు రత్నం రాజం, నాయకులు కూనసాయి, ముస్తఫా, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.