11-04-2025 12:00:00 AM
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి) : ఈ నెల 27న వరంగల్ లో జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం హైదర్ గూడలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ వరంగల్ లో ఈనెల 27వ తారీఖున జరిగే రజితోత్సవ బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి వేలాదిగా కార్యకర్తలు, నాయకులు తరలి రావాలని పార్టీ శ్రేణులను కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జై సింహ, ముషీరాబాద్, కవాడిగూడ, భోలక్ పూర్, గాంధీ నగర్, రాంనగర్, అడిక్మెట్ డివిజన్ అధ్యక్షులు రాకేష్ కుమార్, కొండా శ్రీధర్ రెడ్డి, వై. శ్రీనివాస్ రావు, వల్లాల శ్యామ్ యాదవ్, బల్ల శ్రీనివాస్ రెడ్డి, శంకర్ ముదిరాజ్, మీడియా ఇన్ఛార్జ్ ముచ్చ కుర్తి ప్రభాకర్, సురేందర్, పోతుల శ్రీకాంత్, ఆకుల అరుణ్, సాయికుమార్, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.