23-04-2025 12:31:31 AM
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపు
ఖమ్మం, ఏప్రిల్ 22( విజయక్రాంతి ):-వరంగల్ లో ఈ నెల 27న జరుగనున బీఆర్ ఎస్ బహిరంగ సభ కు కార్యకర్తలు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చే యాలని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు.
ఖమ్మం బుర్హాన్ పు రం లోని 51వ డివిజన్ లో మంగళవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశం లో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను అన్నిటిలో విఫలం అయ్యిందని పేర్కొన్నా రు. కాంగ్రెస్ ను గెల్పించిన ప్రజలే నేడు మోసపోయామని అనుకుంటున్నారని అ న్నారు.
ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేంతవరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.వరంగల్ లో జరుగనున బహిరంగ సభ కు అధిక సంఖ్యలో తరలి వచ్చి సభ నీ విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు శీలం శెట్టి వీర భద్రం,51వ డివిజన్ కార్పొరేటర్ శీలంశెట్టి రమాదేవి, బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు